.png)
జ్యోతీ కృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా చేసిన ‘హరిహర వీరమల్లు’ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ప్రారంభించారు.
విజయ డెయిరీ పాల ప్యాకెట్స్ వినియోగించే హైదరాబాద్ నగరవాసులు వాటిపై ‘హరిహర వీరమల్లు’ ప్రకటన చూసి ఆశ్చర్యపోయారు. హరిహర వీరమల్లు పోస్టర్లతో నగరంలో కొన్ని బస్సులు తిరుగుతుండటం చూసి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ఇ
క్కడితో అయిపోలేదు. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే కొన్ని విమానాలపై హరిహర వీరమల్లు భారీ పోస్టర్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సినిమా పూర్తిచేయడానికి నాలుగేళ్ళు పట్టినా, అనేకసార్లు వాయిదా పడినా విడుదల చేసే ముందు ఈ స్థాయిలో గట్టిగా ప్రమోషన్స్ నిర్వహిస్తుండటం చూసి అభిమానులు చాల సంతోషిస్తున్నారు.
ఈ నెల 20న విశాఖపట్నంలో హరిహర వీరమల్లు ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మొదట అనుకున్నప్పటికీ హైదరాబాద్‌లోనే ఓ హోటల్లో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈలోగా మూవీ మేకింగ్ వీడియో, మరో పాట విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. హరిహర వీరమల్లు సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. డాని ప్రకారం ఈ సినిమా నిడివి 2.42 గంటలు.
హరిహర వీరమల్లులో బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, దక్షిణాది నుంచి ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లుని మొదలుపెట్టగా జ్యోతీ కృష్ణ దర్శకత్వంలో దానిని పూర్తి చేశారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, జ్యోతి కృష్ణ, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించిన హరిహర వీరమల్లు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.