
విజయ్ కనకమేడల దర్శకత్వంలో మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించిన ‘భైరవం’ సినిమా మే 30న విడుదలై పాజిటివ్ టాక్ దాంతో కలెక్షన్స్ సాధించుకొని థియేటర్ల నుంచి బయటపడి ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి జీ5 ఓటీటీలో భైరవం తెలుగు, హిందీ భాషల్లో ప్రసారం అవుతోంది.
భైరవం కధ క్లుప్తంగా చెప్పుకుంటే ఓ గ్రామంలో ఆలయ భూములను కాజేయాలనుకున్న మంత్రికి హీరోలకు మద్య జరిగే పోరాటాలు.
ఈ సినిమాలో ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించారు. జయసుధ, అజయ్, రాజా రవీంద్ర, సంపత్ రాజ్, సనీడప రాజ్, వెన్నెల కిషోర్, శరత్ లోహితస్వ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి దర్శకత్వం, స్క్రీన్ ప్లే: విజయ్ కనకమేడల, కెమెరా: హరి కే వేదాంతం, డైలాగ్స్: సత్యశ్రీ, తూం వెంకట్, పాటలు: భాస్కరభట్ల, కాశర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి జావన, సంగీతం: శ్రీచరణ్ పాకాల, స్టంట్స్: రామకృష్ణన్, నటరాజ మాదిగొండ, ఎడిటింగ్: చోట కే ప్రసాద్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకే రాధామోహన్ నిర్మించారు.