అన్న అంటేనే.. కింగ్‌డమ్‌ లిరికల్ సాంగ్

గౌతమ్‌ తిన్ననూరి-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఈ నెల 31న విడుదల కాబోతున్న ‘కింగ్‌డమ్‌’ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే విజయ్ ఇంతవరకు చేయని జోనర్లో ఈ సినిమా ఉంది కనుక. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున ‘అన్న అంటేనే..’ అంటూ సాగే ఓ సెంటిమెంట్ సాంగ్‌ నేడు విడుదల చేశారు. విజయ్ దేవరకొండ అన్నగా సత్యదేవ్ నటించారు. 

ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, కెమెరా: గిరీష్‌ గంగాధరన్‌, జోమన్ టి జాన్, ఎడిటింగ్: నవీన్ నూలి, యాక్షన్: యానిక్ బెన్, చేతన్ డిసౌజా, రియల్ సతీష్ చేస్తున్నారు.  

కృష్ణకాంత్ వ్రాసిన ఈ పాటని అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించి స్వయంగా పాడారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా భాగ్యశ్రీ భోరే నటిస్తోంది. రుక్మిణీ వసంత్ కీలకపాత్ర చేస్తోంది. కౌశిక్ మహత, కేశవ్ దీపక్, మణికంఠ వారణాసి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 31న విడుదల కాబోతోంది.