పరదా వెనుక పాట.. యత్ర నార్యస్థు..

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్ర చేస్తున్న ‘పరదా’ సినిమా నుంచి యత్ర నార్యస్థు.. అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ఈరోజు విడుదల చేశారు. వనమాలి వ్రాసిన ఈ పాటకి గోపీ సుందర్ సంగీతం అందించి స్వరపరచగా అనురాగ్ కులకర్ణి పాడారు. 

ప్రవీణ్ కాండరేగుల దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమాలో మూఢాచారాలకు బలైన సుబ్బు అనే ఓ పల్లెటూరి పిల్లగా అనుపమ నటించింది. దర్శన్ రాజేంద్రన్, సంగీత తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సంగీతం: గోపీ సుందర్, కెమెరా: మృధుల్ సుజీత్ సేన్‌, ఆర్ట్: శ్రీనివాస్ కాళింగ, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల చేశారు. 

ఆనంద్ మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ కలిసి నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 22న విడుదల కాబోతోంది.