తమ్ముడు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు

నితిన్ చేసిన రాబిన్‌హుడ్ భిన్నమైన కధతో తీశారు కనుక తప్పకుండా హిట్ అవుతుందనుకునే మిశ్రమ స్పందన రావడంతో పెద్దగా ఆడలేదు. దాని తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తీసిన ‘తమ్ముడు’ అయినా కూడా నిరాశపరిచింది.

జూలై 4న విడుదలైన ఈ సినిమా నితిన్ కెరీర్‌లో మరో ఫ్లాప్ సినిమాగా నిలిచింది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే ఊహించారు. అందుకే తమ్ముడు విడుదలకు ముందు ఈ సినిమా గురించి మాట్లాడకుండా వేణు ఎల్దండి దర్శకత్వంలో చేస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాతో నితిన్ మరో మెట్టు ఎక్కుతాడు,’ అని అన్నారు. 

తమ్ముడు గురి తప్పింది కనుక ఇక చివరి మజిలీ ఓటీటీలోకి వచ్చేసే సమయం ఆసన్నమయ్యింది. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి ఆగస్ట్ 1న రాబోతున్నట్లు తాజా సమాచారం. 

ఈ సినిమాలో సప్తమి గౌడ, లయ, హర్ష బొల్లమ్మ, సూరబ్ సచ్ దేవ్, శ్వాసిక, హరితేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సంగీతం: బి. ఆజనీష్ లోక్‌నాథ్, కెమెరా: కేవీ గుహ్యం, సమీర్ రెడ్డి, సేతు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: జీఎం శేఖర్, స్టంట్స్: విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ చేశారు. 

వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాజు, సతీష్ కలిసి రూ.75 కోట్లు బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించారు.