గర్ల్ ఫ్రెండ్ నుంచి నదివే..పాట ప్రమో

రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జంటగా చేస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి నదివే.. అంటూ సాగే తొలి రొమాంటిక్ సాంగ్ ప్రమో నేడు విడుదల చేశారు. ఒకేసారి 5 భాషలలొ పాట ప్రమో విడుదల చేయడం గొప్ప విషయమే.

తెలుగులో రాకేందు మౌళి వ్రాసిన ఈ పాటని హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి అద్భుతంగా పాడారు. ఈ పాటలో రష్మిక, దీక్షిత్ డాన్స్ కాంపొజిషన్స్ యువతకు అద్భుతంగా అనిపించవచ్చు కానీ ఇద్దరూ జిమ్నాస్టిక్స్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ జిమ్నాస్టిక్స్ పాటలో భావాన్ని, అనుభూతిని ప్రేక్షకులు ఆస్వాదించనీయకుండా చేస్తుంది.      

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్ చేస్తున్నారు. 

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలొ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.