ప్యారడైజ్‌లో భాగ్యశ్రీ బోర్సే?

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో ‘ది ప్యారడైజ్‌’ షూటింగ్ హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా సాగుతోంది. ఓ భారీ యాక్షన్ సీన్ ఘాట్ చేసేందుకు అక్కడే సెట్స్ సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఖరారు అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. 

ఈ సినిమాని లాంచ్ చేసినప్పుడు “చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించే రాసిన్రు.. గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. ఇది కడుపు మండిన కాకుల కధ. జమానా జమాన కెళ్ళి నడిచే శవాల కధ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఓ జాతి కధ..” అంటూ ప్యారడైజ్ అంటే స్వర్గం కాదని మరేదో భయానకమైన కధ ఉందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అప్పుడే చెప్పేశారు. 

ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ మార్చి 26న విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ గ్లింమ్స్‌లోనే ప్రకటించారు.