దొర పొగాకా.. 23 నుంచి మూడో పాట !

మల్లేశం, 8 ఏఎం మెట్రో సినిమాలతో మెప్పించిన రాజ్ ఆర్‌ దర్శకత్వంలో  ‘23’ అనే పేరుతో వస్తున్న సినిమా పొగాకు కార్మికుల కష్టాలను కళ్ళకు కట్టేలా ఓ చక్కటి పాట నేడు విడుదల చేశారు.

1991లో జరిగిన చుండూరులో దళితుల ఊచకోత, 1993లో చిలకలూరిపేటలో బస్సులో సజీవదహనం, 1997 జూబ్లీహిల్స్‌ బాంబ్ బ్లాస్ట్ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతోందా?అనే ప్రశ్నతో ఈ సినిమా తీశారు.    

దొర పొగాకా అంటూ మనసులను హత్తుకునేలా సాగే ఈ పాటని ఇండస్ మార్టిన్ వ్రాయగా మార్క్ కే రాబిన్ స్వరపరిచి సంగీతం అందించారు. అతిధి భావరాజు ఆలపించారు. 

ఈ సినిమాలో జాన్సీ, తేజ, తన్మయి, పవన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకి సంగీతం: మార్క్ కే రాబిన్, కెమెరా: సన్నీ కూరపాటి, డైలాగ్స్: ఇండస్ మార్టిన్, పాటలు: చంద్రబోస్, రహమాన్, ఇండస్ మార్టిన్, ఎడిటింగ్: అనిల్‌ ఆలయం, ఆర్ట్: విష్ణువర్ధన్ పుల్ల చేశారు. 

“మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా?” అని ప్రశ్నిస్తూ తీసిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.    

స్టూడియో 99 బ్యానర్‌పై తీసిన ఈ సినిమాని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా త్వరలో విడుదల చేయబోతోంది.