కూలీ నుంచి సెకండ్ సింగిల్ మోనికా..

కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ 171వ సినిమా ‘కూలీ’ షూటింగ్ ప్రారంభించక ముందు నుంచే దానిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 14వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి మోనికా అంటూ పూజా హెగ్డే చేసిన ఓ స్పెషల్ సాంగ్ నేడు విడుదల చేశారు. కృష్ణ కాంత్ వ్రాసిన ఈ పాటకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించి సుభలక్షినితో కలిసి పాడారు.

ఈ సినిమాకు కధ: లోకేశ్ కనగరాజ్, డైలాగ్స్: చంద్ర అంబజగన్, సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, కెమెరా: గిరీష్ గోవర్ధన్, ఎడిటింగ్: ఫీలోమిన్ రాజ్ చేస్తున్నారు.  

ఈ సినిమాలో ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్, రెబ్బా మోనికా, జూనియర్ ఎంజీఆర్, కాళీ వెంకట్, రిషికాంత్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. నాగార్జున, అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో నటించారు. రూ.230 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దీనిని 5 భాషల్లో నిర్మిస్తున్నారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/x6OaIcF3hbQ?si=BA9w9HSRqe6vb--1" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>