బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి దోపిడీ సక్సస్ కానీ..

బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి దోపిడీ అంటే ఇదేదో సహకార బ్యాంక్ దోపిడీ వార్త అనుకోవద్దు. అభిషేక్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో తీస్తున్న క్రైమ్ కామెడీ సినిమా. ఈ సినిమా టీజర్‌ ఈరోజు విడుదలైంది. హీరో గ్యాంగ్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మిని విజయవంతంగా దోపిడీ చేయగలిగారు. కానీ దానిలో వారికి లభించింది కేవలం రూ.69,999 మాత్రమే. ఆ దాంతో వారు నిరాశ చెందడం, అదే సమయంలో ఎన్నికలు జరుగుతునందున కొత్త చిక్కుల్లో పడటం వంటివి హాయిగా నవ్వుకునేలా చేస్తాయి. 

ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, బృంద ఆచార్య, గోపాలకృష్ణ దేశ్ పాండే, సాధు కోకిల, శ్రుతీ హరిహరన్ ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: అభిషేక్ ఎం, సంగీతం: జుదా సంధ్యే, కెమెరా: అభిషేక్ జి కాసరగోడ్, ఆర్ట్: రఘు మైసూరు, ఎడిటింగ్: తేజస్ ర్‌, కొరియోగ్రఫీ: భూషణ్, ఉషా బండారీ, దర్శన్ ఎస్ చేశారు. 

శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై హెచ్ కే ప్రకాష్ గౌడ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.