
శేఖర్ కమ్ముల, నాగార్జున, ధనుష్, జిమ్ సరబ్, రష్మిక మందన కాంబినేషన్‌లో జూన్ 20న విడుదలైన కుబేర సూపర్ హిట్ అయ్యింది. మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. కనుక కుబేర కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి కోసం జూలై 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి కుబేర వచ్చేస్తోంది. ఈ విషయం అమెజాన్ ప్రైమ్ వీడియో స్వయంగా ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ కూడా పెట్టింది. కనుక జూలై 18తో ఓటీటీ ప్రేక్షకుల ఎదురుచూపులు ముగుస్తాయి.
క్లుప్తంగా కుబేర కధ: దేశంలో అత్యంత సంపన్నుడైన నీరజ మిత్ర (జిమ్ సరబ్) యావత్ ప్రపంచంలో కెల్లా అత్యంత సంపన్నుడుగా ఎదగాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ‘ఆపరేషన్ సాగర్’పేరుతో లక్ష కోట్ల డీల్ కుదుర్చుకొని దీనిని పక్క ప్లాన్ ప్రకారం అమలుచేసేందుకు జైల్లో ఉన్న సీబీఐ అధికారి దీపక్ తేజ్ (నాగార్జున)ని బయటకు తెస్తాడు. అతను నలుగురు బిచ్చగాళ్ళ పేరిట ఆ సొమ్ము బదిలీ చేసి పనిపూర్తవగానే వారిని చంపేయాలని పెద్ద ప్లాన్ చేస్తాడు. కానీ వారిలో ఓ బిచ్చగాడు దేవా (ధనుష్) తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కుబేర చూసి తెలుసుకుంటే బాగుంటుంది.