రాజమౌళి పేరు యావత్ ప్రపంచం మారిపోయేలా చేసిన సినిమాలు బాహుబలి 1,2.. ఆర్ఆర్ఆర్ సినిమాలు. వీటిలో బాహుబలి విడుదలై పదేళ్ళు అయ్యింది. కనక ఆ రెండు సినిమాలను ఒకటిగా కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని రాజమౌళి ప్రకటించారు.
కానీ రెండు సినిమాలు కలిపితే సుమారు 5-6 గంటలుంటుంది. ఇదివరకు థియేటర్లలో, ఓటీటీలో చూసిన ఆ సినిమాలనే మళ్ళీ అంతసేపు చూడాలంటే ఎవరికీ ఓపిక ఉండదు. కనుక బాహుబలి 1,2లను ఎడిట్ చేసి రెండు మూడు గంటలకు కుదించాల్సి ఉంటుంది.
ప్రేక్షకులని సీట్లలో కూర్చోబెట్టడం ఎలాగో రాజమౌళికి బాగా తెలుసు. కనుక ఆ సినిమా మేకింగ్ వీడియోని, ప్రభాస్, రానా, రామయ్య కృష్ణ, నాజర్, తమన్నా, అనుష్కలతో సహా సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలను కూడా‘బాహుబలి ది ఎపిక్’లో జోడిస్తారేమో?

Baahubali…
The beginning of many journeys.
Countless memories.
Endless inspiration.
It’s been 10 years.

Marking this special milestone with #BaahubaliTheEpic, a two-part combined film.

In theatres worldwide on October 31, 2025. pic.twitter.com/kaNj0TfZ5g
— rajamouli ss (@ssrajamouli) July 10, 2025