
తెలుగు ప్రేక్షకులకు తమిళనటుడు విజయ్ సేతుపతి, మళయాళ నటి నిత్యా మీనన్ ఇద్దరూ చాలా సుపరిచితులే. వారిద్దరూ మధ్యతరగతి కుటుంబంలో భార్యాభర్తలుగా నటించిన తమిళ సినిమా ‘తలైవాన్ తలైవి’ని తెలుగులో సార్ మేడమ్ పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగు టైటిల్ టీజర్ ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమాలో యోగి బాబు ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు.
కోలీవుడ్ దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఎం. సుకుమార్, కొరియోగ్రఫీ: బాబా భాస్కర్, ఆర్ట్: కే.వీరసమర్, ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్, స్టంట్స్: కలై కింగ్ సన్.
సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సేందిల్ త్యాగరాజన్, సాయి సిద్ధార్ధ నిర్మిస్తున్నారు.