
అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే పేరు ఖరారయ్యింది. ఈ సినిమాని సుమారు రూ.800-1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో తీయబోతున్నందున, అంతర్జాతీయ ప్రేక్షకులకు సూపరిచితులైన నటీనటులను కూడా తీసుకోబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ బ్యూటీలు జాన్వీ కపూర్, రష్మిక మందన, మృణాళినీ ఠాకూర్లను కూడా ఈ సినిమాలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తని ఇంకా ధృవీకరించాల్సి ఉంటుంది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. కనుక త్వరలోనే సినిమా పూజా కార్యక్రమం నిర్వహించి, తొలి షెడ్యూల్ షూటింగ్ ముంబయిలో మొదలుపెట్టే అవకాశం ఉంది.