.jpg)
ఈ 2025 అక్కినేని కుటుంబానికి చాలా బాగుంది. నాగ చైతన్య నటించిన ‘తండేల్’ ఫిబ్రవరి 7న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో అక్కినేని కుటుంబం తొలిసారిగా వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టగలిగింది. అక్కినేని నాగార్జున నటించిన కుబేర జూన్ 20న విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో అక్కినేని నాగార్జున కూడా వంద కోట్ల క్లబ్లో చేరడంతో తండ్రీ కొడుకులు సరికొత్త రికార్డ్ సృష్టించారు. జూన్ 6న అక్కినేని ఇంట్లో మళ్ళీ పెళ్ళి బాజాలు మోగాయి. ఈసారి రెండో కొడుకు అఖిల్ పెళ్ళి జైనాబ్ రవ్‌డ్జీతో జరిగింది.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలి సినిమాలో నాగార్జున విలన్‌గా నటించారు. ఈ సినిమాపై మొదటి నుంచే చాలా బారీ అంచనాలున్నాయి. ఆగస్ట్ 14 న విడుదల కాబోతున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే అక్కినేని కుటుంబానికి 2025 సంవత్సరంలో అంతా మంచే జరుగుతోందని చెప్పవచ్చు.
నాగార్జున కూలి సినిమా చేస్తున్నప్పుడే కోలీవుడ్ దర్శకుడు ఆర్ఏ కార్తీక్‌తో తన వందవ సినిమా ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతునట్లు సమాచారం. ఆ సినిమా తర్వాత కోలీవుడ్ దర్శకుడు ఆర్. మందిర మూర్తి దర్శకత్వంలో 2023లో విడుదలైన తమిళ సినిమా ‘ఆయొత్తి’ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నట్లు తాజా సమాచారం. అయితే అది నాగార్జున ఇమేజ్‌కి సరిపోదు. కనుక దానిని వేరే నటీనటులతో నాగార్జున నిర్మించే అవకాశం ఉంది.
‘ఆయొత్తి’ కధ క్లుప్తంగా.. కాశీ నుంచి ఓ కుటుంబం రామేశ్వరం పర్యటనకు వచ్చినప్పుడు, కారు ప్రమాదంలో ఇల్లాలు చనిపోతుంది. ఆమె మృతదేహాన్ని కాశీకి తీసుకువెళ్ళి అక్కడే అంత్యక్రియలు చేయాలనుకుంటాడు ఆమె భర్త.
కానీ తమిళనాడులో పోలీస్ కేసు నమోదవడం, తర్వాత పోస్ట్ మార్టం వగైరా ఈ సందర్భంగా తమిళనాడులో భాష కారణంగా ఆ కుటుంబం పడే ఇబ్బందులు ప్రతీ ఒక్కరినీ కదిలిస్తాయి.
అహంకారంతో విర్రవీగే ఆమె భర్తకు కులమతాలు, భాష ప్రాంతం వంటి సంకుచిత భావాలకు అతీతంగా ఓ స్థానికుడు సాయపడటం, ఎట్టకేలకు ఆమె మృతదేహాన్ని విమానంలో కాశీ తరలించే ప్రయత్నంలో జరిగిన ఘటనలు అన్నీ గుండెని పిండేస్తాయి.
తీవ్ర భావోద్వేగాలతో కూడుకున్న ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ ఈ కధలో నాగార్జున ఇమేజ్‌కు సరిపడే పాత్ర లేదనే చెప్పాలి. కానీ అహంభావంతో విర్రవీగే భర్త/తండ్రిగా నటించేందుకు ఆస్కారం ఉంది. నాగార్జున అలాంటి పాత్ర ఎన్నడూ చేయలేదు. కనుక చేస్తే ఆ పాత్ర చేయవచ్చు లేదా వేరే నటీనటులతో తమ అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించవచ్చు.