టాలీవుడ్‌లోకి మరో అబ్బాయ్ మాధవ్!

టాలీవుడ్‌ హీరోల వారసులు సినీ పరిశ్రమలో హీరోలుగా ప్రవేశిస్తూనే ఉన్నారు. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ ‘మారెమ్మ’ సినిమాతో హీరోగా వస్తున్నాడు. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో తీసిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా నటించబోతోంది. ఈరోజు ఈ సినిమా టైటిల్‌ ప్రకటించి, మాదవ్ ఫస్ట్-లుక్‌ పోస్టర్ విడుదల చేశారు. 

మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై బండారు మయూర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: ప్రశాంత్ ఆర్‌ విహారి, కెమెరా: ప్రశాంత్ అంకిత్ రెడ్డి చేస్తున్నారు. త్వరలోనే పూర్తివ ఇవరాలు ప్రకటిస్తామని క్రియేటివ్ ప్రొడ్యూసర్ కుశాల్ రెడ్డి కందాల చెప్పారు.