కొత్తపల్లిలో ఒకప్పుడు.. టీజర్‌ విడుదల

పెద్ద హీరోలు, వారితో వందల కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీలు తీస్తున్న దర్శకులు తమ సినిమాలకు ఇంగ్లీష్, హిందీ పేర్లు పెట్టుకొని అదే గొప్ప అనుకుంటుంటే, చిన్న సినిమా నిర్మాతలు, దర్శకులు చక్కగా అచ్చమైన తెలుగు పేర్లు, తెలుగు ప్రజల జీవన విధానాన్ని ప్రతిభింబించే చక్కటి కధలతో చక్కటి నేటివిటీతో చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. 

అటువంటిదే ‘కొత్తపల్లిలో ఒకప్పుడు.’  ప్రవీణ్ పరుచూరి దర్శకత్వంలో తీసిన ఈ సినిమాలో రవీంద్ర విజయ్ దేవరకొండ, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేమ్ సాగర్ ముఖ్యపాత్రలు చేస్తుండగా మనోజ్ చంద్ర, మోనిక, ఉష బోనెల నటీనటులుగా పరిచయం అవుతున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌ ఈ సినిమాపై అంచనాలు ఏమీ పెంచేయలేదు కానీ ఎప్పుడూ నగరాలు, పట్టణాలలో ఉండేవారు ఓసారి అలా పల్లెటూరికి వెళ్ళి రావలనుకుంటే తప్పకుండా ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో పల్లెతత్వవరి గడుసుపిల్ల సావిత్రిగా ఉష బోనెల నటించింది.   

పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ బ్యానర్‌పై గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి కలిసి నిర్మించిన ఈ సినిమాని ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా సమార్పిస్తున్నారు. ఈ సినిమాకు కధ, డైలాగ్స్: గురుకిరణ బాతుల, సంగీతం: మణిశర్మ, కెమెరా: పెట్రోలస్ ఆంటోనియాడిస్, కొరియోగ్రఫీ: వై మెహర్ బాబా, ఎడిటింగ్: కిరణ్ ఆర్‌, స్టంట్స్: మార్వెల్ నటరాజ చేశారు.  చేశారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదల కాబోతోంది

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/7sNp0L7caS4?si=NoFJX0Yia06W1kfJ" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>