హైదరాబాద్‌లో మరో భారీ సినీ స్టూడియో

హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణా స్టూడియోస్ వంటి అనేక సినీ స్టూడియోలున్నాయి. వాటిలో ఏడాది పొడవునా సినిమా షూటింగులు జరుగుతూనే ఉన్నాయి. అలాగే సినీ నిర్మాణంలో సాంకేతిక అంశాలకు సంబందించి ప్రసాద్ ల్యాబ్స్, రికార్డింగ్ స్టూడియోలు వంటివి కూడా చాలానే ఉన్నాయి. కనుకనే సినీ పరిశ్రమకి పుట్టిల్లు వంటి ఏపీకి తరలివెళ్ళేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పుడు హైదరాబాద్‌లో మరో భారీ స్టూడియో రాబోతోంది. బాలీవుడ్‌ సీనియర్ నటుడు అజయ్ దేవగణ్ దేవగణ్ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ భారీ సినిమా స్టూడియో నిర్మించేందుకుగాను ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

తెలంగాణలో సినీ స్టూడియో ఏర్పాటుకి సహకరించాల్సిందిగా ఆయన సిఎం రేవంత్ రెడ్డిని కోరగా సానుకూలంగా స్పందించారు. అజయ్ దేవగన్ ఏర్పాటు చేయబోయే సినీ స్టూడియోలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్‌, ఏఐ ఆధారిత టెక్నాలజీతో సినిమా షూటింగులు చేసుకొనేందుకు వీలుగా నిర్మిస్తామని, అలాగే ఈ మూడు రంగాలలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఓ శిక్షణా కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

ప్రభుత్వం తగిన భూమి కేటాయించి ప్రోత్సాహకాలు ఇస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో స్టూడియో నిర్మించేందుకు సిద్దంగా ఉన్నామని అజయ్ దేవగణ్ సిఎం రేవంత్ రెడ్డికి చెపపారు. 

సినీ స్టూడియో నిర్మాణానికి సుమారు రూ.500 నుంచి 1,000 కోట్లు వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. సిఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు కనుక త్వరలోనే హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ స్థాయిలో సినీ స్టూడియో ఏర్పాటు కావడం ఖాయమే.