
సినీ పరిశ్రమలో సీనియర్లు అనగానే బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వారి తర్వాత తరంలో రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు తదితరుల పేర్లు చెప్పుకుంటారు. కానీ అల్లరి నరేష్ ఇప్పటి వరకు 62 సినిమాలు చేసిన రెండో తరం నటులలో ఒకరంటే నమ్మశక్యంగా ఉండదు.
ఒకప్పుడు కామెడీ సినిమాలతో అందరినీ అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు బచ్చలమల్లి వంటి సీరియస్ సినిమాలతోను మెప్పిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆయన 63వ సినిమాకి పూజా కార్యక్రమం జరిగింది.
ఈ సినిమాకి రచయిత, దర్శకుడు మెహర్ తేజ్ దర్శకత్వం చేస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ సోమవారం విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఈరోజు ఓ ఆసక్తికరమైన పోస్టర్ సోషల్ మీడియాలో పెట్టారు.
సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీబ్రాన్ అందిస్తున్నారు.