ఓ భామ అయ్యో రామా.. గల్లీ స్టెప్ సుహాస్ పాడేశాడే

రామ్ గోదాల దర్శకత్వంలో సుహాస్, మాళవిక మనోజ్ జంటగా చేసిన ‘ఓ భామ అయ్యో రామా’ సినిమా నుంచి ముచ్చటగా మూడో పాట ‘గల్లీ స్టెప్’ లిరికల్ వీడియో సాంగ్‌ ఈరోజు విడుదల చేశారు. కాశర్ల శ్యామ్ వ్రాసిన ఈ పాటని రాధన్ స్వరపరచగా సుహాస్ స్వయంగా పాడటం విశేషం. సుహాస్ ఏమాత్రం తడబడకుండా చాలా చక్కగా హుషారుగా పాడాడు. అలాగే తన శైలికి పూర్తి భిన్నమైన డాన్స్ కూడా అదరగొట్టేశాడు.  

ఈ ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన్‌ర్‌లో అనిత హంస నందిని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృధ్వీరాజ్, ప్రభాస్‌ శ్రీను, రాఘు కారుమంచి, మోయిన్, సాత్విక్ ఆనంద్, నాయని పావని తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

వి ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ శంకర్‌ నల్లా, ప్రదీప్ తాళ్ళు కలిసి నిర్మించిన ఈ సినిమాకు సంగీతం: రధన్, కెమెరా: మణికందన్, ఆర్ట్: బ్రహ్మ కడలి చేశారు. ఈ సినిమా జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.