
మంచు విష్ణు, మంచు మనోజ్ సోదరుల మద్య జరిగిన గొడవల తర్వాత కన్నప్ప ఫ్లాప్ అవుతుందంటూ మనోజ్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఆ సినిమాలో ప్రభాస్ ఉన్నారని, తన వ్యాఖ్యలకు ఆయన అభిమానులు ఆగ్రహిస్తే ‘భైరవం’ బెడిసికొడుతుందని గ్రహించి వెంటనే క్షమాపణ చెప్పి కన్నప్ప గ్రాండ్ సక్సస్ అవ్వాలని కోరుకున్నారు.
ఈరోజు మనోజ్ కూడా హైదరాబాద్‌లో థియేటర్‌కి వెళ్ళి కన్నప్ప సినిమా చూడటం విశేషం అనుకుంటే బయటకు వచ్చిన తర్వాత “సినిమా చాలా చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఇంకా అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ అదిరిపోయింది. విష్ణు ఇంత బాగా నటిస్తాడని నేను అనుకోలేదు. కన్నప్ప సినిమాపై పెట్టిన పెట్టుబడికి వెయ్యిరెట్లు కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను,” అని నవ్వుతూ చాలా సంతోషంగా చెప్పారు.
కన్నప్ప సినిమాపై వచ్చిన రివ్యూలలో దాదాపు అందరూ ఇదే చెప్పారు. సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉందంటూనే 5/2.5 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. కన్నప్ప సినిమాపై తమ అభిప్రాయం చెప్పకనే చెప్పారనుకోవచ్చు.
మంచు మనోజ్ కూడా నటుడే కనుక ఈ సినిమాపై ఓ అంచనా ఏర్పడే ఉంటుంది. కనుక ఇది తన అంచనాకు తగ్గట్లే ఉందనే సంతోషమో లేదా నిజంగా సినిమా బాగుండానే సంతోషమో తెలియనివిదంగా మంచు మనోజ్ మాట్లాడినట్లు అనిపిస్తోంది.
కానీ సినిమా బాగుందో లేదో ప్రేక్షకులే ఎలాగూ నిర్ణయిస్తారు. కనుక మనోజ్ లేదా వేరేవరో ఏదో అన్నారని సంతోషపడక్కరలేదు బాధ పడక్కరలేదు.
తన కుటుంబంతో ఉన్న విబేధాల్ని పక్కన పెట్టి 'కన్నప్ప' సినిమా చూడడమే కాదు.
సినిమా చాలా బాగుందని, పెట్టిన పెట్టుబడికి వెయ్యి రెట్లు లాభాల్ని ఆర్జించాలని మనస్ఫూర్తిగా కోరుకొన్నారు మంచు మనోజ్. ఇంతకంటే పాజిటీవ్ మైండ్ సెట్ ఎక్కడ ఉంటుంది?#Kannappa #ManchuManoj pic.twitter.com/uPIw0uI6Mw