ఇక రష్మిక కాదు మైసా అనాలేమో?

సినీ పరిశ్రమలో ప్రతీ నటికి తన కెరీర్‌లో గొప్పగా చెప్పుకునేందుకు ఒక్కటైన హీరోయిన్‌-ఓరియంటడ్‌ సినిమా చేయాలని కోరుకుంటుంది. కానీ చాలా తక్కువమంది నటీమణులకు అటువంటి అవకాశం లభిస్తుంటుంది. రష్మిక మందన్న తన అందచందాలతో, అద్భుతమైన నటనతో ‘నేషనల్ క్రష్’ అనిపించుకున్నప్పటికీ ఇంత వరకు హీరోయిన్‌-ఓరియంటడ్‌ సినిమా చేయలేదు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది.  

అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్: 1గా తీయబోతున్నసినిమాకి ‘మైసా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తీయబోతున్న ఈ సినిమాలో రష్మిక ‘మైసా’గా నటిస్తోంది. 

వేటాడబడి, గాయపడినప్పటికీ నిబ్బరం కోల్పోని యోధురాలుగా ఆమెని పరిచయం చేస్తూ నిన్న ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈరోజు టైటిల్‌ పోస్టర్లో ఆమె ఫస్ట్-లుక్‌ విడుదల చేశారు. అది చూస్తే ఈమె  అంధాల భామ రష్మికేనా అనుమానం కలుగుతుంది. అంత భయంకరంగా ఉంది. 

అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి కలిసి పాన్‌ ఇండియా మూవీగా దేనిని నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు కధ, దర్శకత్వం: రవీంద్ర పుల్లె చేస్తున్నారు. ఈ సినిమాల నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.