
స్టార్ మా టీవీ ఛానల్లో ప్రసారం అయిన బిగ్ బాస్ రియాల్టీ షోలో వివాదాలు, పాపులారిటీ గురించి మళ్ళీ కొత్తగా చెప్పుకోనవసరం లేదు. ఆవిదంగానే ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తయ్యాయి. త్వరలో బిగ్ బాస్ సీజన్-9 ప్రారంభం కాబోతోంది... అని తెలియజేస్తూ ప్రమో విడుదల చేశారు. ఈసారి కూడా నాగార్జునే హోస్టుగా వ్యవహరించబోతున్నారని ప్రమోతో చెప్పేశారు.
“ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే.. యుద్ధం చేస్తే సరిపోదు. కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి.. ఈసారి చదరంగం కాదు రణరంగమే..” అంటూ నాగార్జున బిగ్ బాస్ సీజన్-9 మరింత భీభత్సంగా ఉండబోతోందని సూచించారు. త్వరలోనే స్టార్ మా టీవీ ఛానల్లో బిగ్ బాస్ సీజన్-9 ప్రసారం కాబోతోంది. ఈసారి దీనిలో ఎవరెవరు పాల్గొనబోతున్నారో త్వరలోనే ప్రకటించనున్నారు.