
తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కో సమయంలో ఒక్కో జోనర్లో సినిమాలు వస్తుంటాయి. కొంతకాలం దెయ్యాలు, ఆత్మలు, కొంతకాలం రొమాంటిక్ లవ్ స్టోరీలు.. కొంతకాలం చారిత్రిక సినిమాలు, సోషియో ఫాంటసీ సినిమాలు వస్తుంటాయి. అనుష్క ఓ పోరాట యోధురాలుగా ‘ఘాటి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అందాల భామ రష్మిక మందన కూడా బాణాలు, కత్తులు పట్టుకొని పోరాటాలు చేసేందుకు సిద్దమవుతోంది.
అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్: 1గా తీయబోతున్న సినిమాలో ఆమె గాయపడిన చిరుతలా వస్తోంది. వేటాడబడి, గాయపడినప్పటికీ నిబ్బరం కోల్పోని యోధురాలుగా ఆమెని పరిచయం చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఈ యాక్షన్ సినిమా పోస్టర్, టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ శుక్రవారం ఉదయం 10.08 గంటలకు విడుదల కాబోతోంది.
పొగమంచు కమ్ముకున్న ఓ దట్టమైన అడవిలో ఓ మండుతున్న చెట్టు వద్ద చేతిలో ఆయుధంతో ఆమె నిలబడి ఉండగా, టార్చ్ లైట్లు వెలుగులో ఆమెను పట్టుకునేందుకు కొందరు వస్తున్నట్లు ఈ సినిమా ప్రకటన పోస్టర్లో చూపారు.