కనక వర్షం కురిపిస్తున్న కుబేర

దేవతలలో కుబేరుడు ధనదేవుడు. ఆ పేరుతో శేఖర్ కమ్ముల తీసిన సినిమా నిజంగానే నిర్మాతకి కనక వర్షం కురిపిస్తోంది. జూన్ 20న  ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కుబేర మొదటి వారం పూర్తికాక మునుపే రూ.100 కోట్లు కలెక్షన్స్‌ రాబట్టి ఇంకా దూసుకుపోతోంది. ఇది శేఖర్ కమ్ముల, నాగార్జున, ధనుష్ ముగ్గురి కెరీర్‌లో సరికొత్త రికార్డుగా నిలుస్తోంది. 

ఒక బిలియనీర్ (జిమ్ సరబ్), ఒక బిచ్చగాడు (ధనుష్), జైలు పాలైన ఓ మాజీ సీబీఐ అధికారి (నాగార్జున) మూడు ప్రధాన పాత్రలతో శేఖర్ కమ్ముల ఎంచుకున్న కధ, దానిని తెరకెక్కించిన విధానం, ఆ మూడు పాత్రలను మలచిన తీరు, వారి అద్భుతమైన నటన.. వంటివన్నీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. శేఖర్ కమ్ముల చెప్పినట్లుగానే ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ మెచ్చుకోలేకుండా ఉండరు. అందుకే ఈ కనక వర్షం. 

కుబేరకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేశారు.  

శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమా నిర్మించారు.