
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఛాన్స్ వచ్చిందంటే ఇక స్టార్ ఇమేజ్ దక్కించుకున్నట్టే. అది ఆన్ స్క్రీన్ ఆర్టిస్ట్ అయినా ఆఫ్ స్క్రీన్ టెక్నిషియన్స్ అయినా సరే. ప్రస్తుతం పవన్ త్రివిక్రం కాంబినేషన్లో వస్తున్న సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా సెలెక్ట్ అయ్యాడు కోలీవుడ్ యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ రవిచందర్. అసలైతే బ్రూస్ లీ, అఆ సినిమాలకు ముందు అనిరుధ్ ను అనుకున్నా డేట్స్ అడ్జెస్ట్ అవ్వక ఆ అవకాశాలను వదిలేశాడు.
ఇప్పుడు పవన్ సినిమాకు ముందు నుండే ప్లాన్ చేసుకుంటున్నాడు అనిరుధ్. ఇక సినిమా కథ తనకు తెలుసని దానికి కుదిరేట్టు మ్యూజిక్ అందిస్తానని అంతకంటే ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు నచ్చేలా మ్యూజిక్ అందిస్తానని అన్నారు అనిరుధ్. యువ మ్యూజిక్ డైరక్టర్స్ లో తన ప్రతిభతో వారెవా అనిపిస్తూ కోలీవుడ్లో సత్తా చాటుతున్న అనిరుధ్ తెలుగులో కూడా అదే రేంజ్ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
పవర్ స్టార్ త్రివిక్రం సినిమాలో మ్యూజిక్ కూడా చాలా ప్రత్యేకం. జల్సా, అత్తారింటికి దారేది రెండు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం జరిగింది. అయితే ఈసారి మాత్రం కొత్తగా అనిరుధ్ ను ట్రై చేస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.