రంభ, ఊర్వశి, మేనకలతో నరేష్ అల్లరి ఎలా ఉంటుందో?

అల్లరి నరేష్ ఒకప్పుడు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించేవారు. కానీ అందరూ నటుల్లాగే విభిన్నమైన కధలు, పాత్రలు ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు.

బచ్చలమల్లి వంటి సీరియస్ సినిమా తర్వాత 12 ఏ-రైల్వే కాలనీ అనే సినిమా పూర్తిచేశారు. దాని తర్వాత చంద్రమోహన్ దర్శకత్వంలో  ‘రంభ, ఊర్వశి, మేనక’ అనే ఓ కామెడీ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది సోషియో ఫాంటసీ సినిమా కాదని సమాచారం. త్వరలోనే ఈ సినిమా ప్రకటన వెలువడితే దీని గురించి మరింత సమాచారం లభిస్తుంది. 

12ఏ, రైల్వే కాలనీ సినిమాకి దర్శకుడు నాని కాసరగడ్డ. టైటిల్‌ టీజర్‌లో ఇదో దెయ్యాలు, ఆత్మలు, మర్డర్స్, మిస్టరీ అని హింట్ ఇచ్చేశారు. 

ఈ సినిమాలో డా.కామాక్షి భాస్కర్, సాయి కుమార్‌, వివా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన కుమార్‌, గగన్ విహారీ, అనిష్ కురువిళ్ళ, మధుమణి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

12ఏ, రైల్వే కాలనీ సినిమాకు కధ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే: డా. అనిల్ విశ్వనాధ్, దర్శకత్వం, ఎడిటింగ్: నాని కాసరగడ్డ సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కుషెందర్ రమేష్ రెడ్డి, చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్‌ డేట్ ప్రకటిస్తారు.