
తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం ఉన్న కోలీవుడ్ నటుడు శ్రీరామ్ (శ్రీకాంత్) ఒకప్పుడు సినిమాలలో కనిపిస్తుండేవారు. కానీ మాదక ద్రవ్యాలకు అలవాటుపడటంతో క్రమంగా సినిమా అవకాశాలు తగ్గి జీవితం నాశనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల కేసులో ఇప్పుడు జైలుకి కూడా వెళ్ళారు.
ఈ నెల 23న చెన్నైలోణి నుంగంబాకం పోలీసులు శ్రీరామ్‌ని అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు చేయించగా కొకైన్ తీసుకుంటున్నట్లు నివేదిక వచ్చింది. పోలీసులు ఆయనని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా జూలై 7 వరకు రిమాండ్ విధించడంతో జైలుకి తరలించారు.
ఈ సందర్భంగా శ్రీరామ్ తాను మాదక ద్రవ్యాలకు ఏవిదంగా ఎంతగా అలవాటు పడిపోయారో వివరించారు. కొంతకాలం క్రితం తాను అన్నాడీఎంకే పార్టీకి చెందిన ప్రసాద్ అనే ఓ నేతకి రూ.10 లక్షలు అప్పు ఇచ్చానని, ఆ అప్పు తీర్చమని అడిగేందుకు వెళ్ళినప్పుడు ఆయన తనకు కొకైన్ అలవాటు చేశాడని చెప్పుకొని శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పటి నుంచి డ్రగ్స్ ముఠాలకు గ్రాము కొకైన్‌కి రూ.12,000 చొప్పున చెల్లిస్తూ 40 సార్లు కొనుగోలు చేశానని శ్రీరామ్ చెప్పారు. కొకైన్ కోసం తాను మొత్తం రూ.4.72 లక్షలు గూగుల్ పే యాప్‌లో చెల్లించేవాడినని శ్రీరామ్ తెలిపారు.
అన్నాడీఎంకే పార్టీకి చెందిన ప్రసాద్ కారణంగానే తాను ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎంతో గొప్పగా సాగుతున్న జీవితాన్ని చేజెటులా నాశనం చేసుకున్నానని శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.