
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న ‘తమ్ముడు’ సినిమా నుంచి నేడు ‘జై బగలాముఖీ..’ అంటూ సాగే ఓ భక్తి గీతాన్ని, దాని మేకింగ్ వీడియో విడుదల చేశారు. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు వ్రాసిన ఈ పాటని బి ఆజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచి సంగీతం అందించగా, అబీ వీ పాడారు. ఈ పాట, సంగీతం, నదిలో నుంచి బయటకు తీసిన అమ్మవారి విగ్రహం అన్నీ కూడా రిషబ్ శెట్టి సూపర్ హిట్ సినిమా ‘కాంతారా’ని పోలి ఉన్నట్లు అనిపిస్తుంది.
ఈ సినిమాలో సప్తమి గౌడ, లయ, హర్ష బొల్లమ్మ, సూరబ్ సచ్ దేవ్, శ్వాసిక, హరితేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: బి. ఆజనీష్ లోక్‌నాథ్, కెమెరా: కేవీ గుహ్యం, సమీర్ రెడ్డి, సేతు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: జీఎం శేఖర్, స్టంట్స్: విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ చేస్తున్నారు.
వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాజు, సతీష్ కలిసి నిర్మిస్తున్న తమ్ముడు, జూలై 4 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/_ul-1OJ8nf0?si=7Nw6oJw9dAs8glL_" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>