
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మీడియా మీద కాస్త అసహనంతో ఉంది. తన రెమ్యునరేషన్ విషయంలో మీడియా చేస్తున్న రచ్చకి అమ్మడు తలపట్టుకునే పరిస్థితి వచ్చింది. అంతేకాదు రకుల్ గాలి ఇంట్లో వేసిన చిందులకు ఆమెకు ఐటి సెగ తగిలిందని.. ఐటి అధికారులు ఆమెకు నోటీసులు పంపారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్ని ఎలా వస్తాయో అర్ధం కాదంటుంది రకుల్.
తన రెమ్యునరేషన్ ఐటి నోటీసులు ఇవన్ని వట్టి మాటలే.. తాను ప్రతి విషయాన్ని మీడియాతో షేర్ చేసుకుంటా అలాంటిది తన పట్ల ఇలాంటి అవాస్తవమైన వార్తలు రాయడం కరెక్ట్ కాదని అంటుంది. మీడియా ఫ్రెండ్లీగా ఉన్న తన పట్ల నెలకో రూమర్ పుట్టించడం కాస్త ఇబ్బందిగా ఉంది. దీనికి నాన్న చాలా బాధ పడుతున్నారంటూ రకుల్ తన ఆవేదన వ్యక్తపరుస్తుంది.
మరి హీరోయిన్ అది కూడా స్టార్ రేసులో ఉన్నప్పుడు ఇలాంటి రూమర్స్ కామన్ అని ఊరుకోవాలే తప్ప మరి అంతలా ఫీలయ్యిపోకూడదు. ఈ విషయంలో రకుల్ ఇంకా చాలా విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుంది.