
విజయేందర్ దర్శకత్వంలో ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం, రాగ్ మయూర్, విష్ణు ఓఐ, ప్రసాద్ బేహార ప్రధాన పాత్రలలో మిత్రమండలి అనే కామెడీ సినిమా సిద్దమవుతోంది. ఈ సినిమా నుంచి కట్టందుకో జానకీ... అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. పనిపాటు లేకుండా తిరుగుతున్న కొడుకులు, వారి తండ్రులు ఒకరితో మరొకరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో హాయిగా నవ్వుకునేలా చూపుతూ తీసిన పాటే ఈ కట్టందుకో జానకీ.
కాసర్ల శ్రీరామ్ వ్రాసిన ఈ పాటకి ఆర్‌ఆర్ ధ్రువన్ సంగీతం అందించి స్వరపరచి సిప్లీ గంజ్‌తో కలిసి హుషారుగా పాడారు.
ఈ సినిమాకు సంగీతం: ఆర్‌ఆర్ ధ్రువన్, కెమెరా: సిద్ధార్థ్ ఎస్‌జె, కొరియోగ్రఫీ: మొయిన్, ఎడిటింగ్: పీకే, ఆర్ట్: గాంధీ నడికుడికర్ చేశారు.
సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, డా. విజయేందర్ రెడ్డి తీగల కలిసి నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.