నాగ చైతన్య తర్వాత మజిలీ శివ నిర్వాణతోనే

నాగ చైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో తన 24వ సినిమా చేస్తున్నారు. అడవులలో సాగే సాహసోపేతమైన కధతో తీస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

ఈ సినిమాకి ‘వృష ఖర్మ’ అని టైటిల్‌ ఖరారు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా ఖరారు చేయవలసి ఉంది. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమాకి నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తనకు మజిలీ వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు శివ నిర్వాణతో మళ్ళీ కలిసి పనిచేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. 

నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శివ నిర్వాణ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా భావోద్వేగాలతో కూడిన కుటుంబ కధా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. బహుశః ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది.