
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఏప్రిల్ 26న హైదరాబాద్ జేఆర్పీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ‘రెట్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనప్పుడు విజయ్ దేవరకొండ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు వారిని అవమానపరిచేలా ఉన్నాయంటూ గిరిజన సంఘం నాయకుడు రమేష్ రాథోడ్ రాయదుర్గం పోలీసులకు పిర్యాదు చేశారు.
విజయ్ దేవరకొండ ఏమన్నారంటే, జమ్ము కశ్మీర్లో పహల్గాంలో జరిగిన దాడి వంటివి ఒకప్పుడు వివిద తెగల మద్య కూడా జరుగుతుండేవి,” అని అన్నారు.
చరిత్ర గురించి కనీస అవగాహన లేకుండా గిరిజన తెగల గురించి విజయ్ దేవరకొండ ఆవిదంగా మాట్లాడటం వారిని అవమానించడమే కనుక ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని అడ్వకేట్ లాల్ చౌహాన్ కోరారు. కానీ విజయ్ దేవరకొండ స్పందించకపోవడంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు.