జననాయకుడు... ఫస్ట్ గ్లింమ్స్‌

కోలీవుడ్‌ మాస్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో ‘జన నాయగన్’ తెలుగులో ‘జన నాయకుడు’ ఫస్ట్ గ్లింమ్స్‌ విడుదలైంది. 

హెచ్.వినోద్ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుండగా, బాబీ డియోల్, మమిత బైజు, గౌతమ్‌ తిన్ననూరి వాసుదేవ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నారాయణ్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, కెమెరా: సత్యన్ సూర్యన్‌, యాక్షన్: అనల్ అరసు, ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్, కొరియోగ్రఫీ: శేఖర్ విజే, సుధన్ చేస్తున్నారు.      

కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగకు ముందు విడుదల కాబోతోంది.