
ప్రవీణ్, వైవా హర్ష, షైనింగ్ ఫణి, కృష్ణ భగవాన్ వంటి పలువురు హాస్య నటులు ముఖ్య పాత్రలు చేస్తున్న ‘భకాసుర రెస్టారెంట్’ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. సినిమా టైటిల్, కాన్సెప్ట్ రెండూ భిన్నంగా ఉన్నందున ప్రేక్షకులు ఈ సినిమా ఎలా ఉంటుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా నుంచి ‘అయ్యో ఏమిరా ఈ జీవితం..” అంటూ సాగే ఓ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. విష్ణు వర్ధన్ వ్రాసిన ఈ పాటకి వికాస్ బడిస సంగీతం సమకూర్చగా, రాహుల్ సిప్లీ గంజ్ అద్భుతంగా పాడారు.
మహాభారత కాలం నాటి భకాసురుడనే రాక్షసుడి ఆత్మ ఆవహించినవారి ఆకలి తీర్చడానికి హీరో బృందం పడే తిప్పలు, దెయ్యాలు, ఆత్మల కధలే ఈ సినిమా కధ.
ఎస్ జె శివ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు కధ: వినయ్ కొట్టి, సహ రచయిత: సాయి దామరి, సంగీతం: వికాస్ బడిస, కెమెరా: బాల సరస్వతి, ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్ చేశారు.
ఎస్ జె మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి కలిసి నిర్మించిన బకాసుర రెస్టారెంట్ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే విడుదల కాబోతోంది.