సమంత-రాజ్ నిడిమోరు డేటింగ్: శ్యామలి రియాక్షన్

ఫ్యామిలీ మ్యాన్, సిటాడేల్ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లను అందించిన దర్శకుడు రాజ్ నిడిమోరు, వాటిలో నటించిన సమంతతో ప్రేమలో పడి ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలపై ఆయన భార్య శ్యామలి ఇన్‌స్టాగ్రామ్‌లో తన స్పందనలు క్లుప్తంగా వెల్లడిస్తున్నారు. 

తాజాగా ఆమె ఓ మెసేజ్ పెట్టారు. నమ్మకం అనేది అన్నిటి కంటే చాలా విలువైనది. ఒకసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి పొందలేరు,” అని దాని సారాంశం. 

అంతకు ముందు మరో మెసేజ్‌లో, “కాలం అన్నిటినీ బయటపెడుతుంది. కర్మ సమాధానం చెపుతుంది. ఈ విశ్వం అన్నిటినీ నిశితంగా చూస్తుంటుంది,” అని దాని సారాంశం. 

రాజ్ నిడిమోరు, శ్యామలి దంపతులు చాలా కాలంగా వేర్వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కనుకనే రాజ్ నిడిమోరు సమంతకు దగ్గర అయ్యుండవచ్చు. వారి బంధాన్ని శ్యామలి ఆమోదించలేరు కనుక తన అభిప్రాయాలను ఈవిదంగా తెలియజేస్తున్నారనుకోవచ్చు. అయితే రాజ్ నిడిమోరు, శ్యామలి ఇంకా విడాకులు తీసుకోలేదని తెలుస్తోంది. కనుక సమంతని పెళ్ళి చేసుకోవాలంటే ముందుగా భార్య శ్యామలని విడాకులకు ఒప్పించడం, ఆ తర్వాత పరస్పర అంగీకారంతో లేదా వేరే కారణాలతో విడాకులు పొందవలసి ఉంటుంది. ఇందుకు శ్యామలి అంగీకరించకపోతే రాజ్ నిడిమోరు-సమంత ప్రేమాయణం డేటింగ్‌తోనే సరిపెట్టుకోక తప్పదేమో?