పెద్దిలో రామ్ బుజ్జి ఫస్ట్-లుక్‌

బుచ్చిబాబు, రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న ‘పెద్ది’లో నటిస్తున్న రామ్ బుజ్జి అనే మరో నటుడిని ఈరోజు పరిచయం చేశారు. ఈరోజు రామ్ బుజ్జి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘పెద్ది’ లో ఆయన ఓ ముఖ్యపాత్ర చేస్తున్నట్లు తెలియజేశారు.       

ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ నటిస్తుండగా జగపతి బాబు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మాతగా నిర్మిస్తున్న ‘పెద్ది’కి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న సినిమా విడుదల కాబోతోంది.