
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక, జిమ్ సరబ్ ప్రధాన పాత్రలలో ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కుబేర సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.
అయితే సినిమా రన్ టైమ్ ఏకంగా మూడు గంటలు ఉండటం విశేషం. సినిమా కధ డబ్బు, లాలస, పేదరికం, పేద-ధనిక వర్గాల మద్య ఘర్షణ తదితర అంశాలతో సాగుతుంది కనుక ఈ సినిమాలో శేఖర్ కమ్ముల చాలా అంశాలను టచ్ చేశారు. అందువల్లే సినిమా నిడివి పెరిగిందనుకోవచ్చు.
అయితే శేఖర్ కమ్ములకు స్క్రీన్ ప్లేతో థియేటర్లో ప్రేక్షకులను ఎలా కట్టిపడేయాలో బాగా తెలుసు. కనుక కుబేర మూడు గంటలైనప్పటికీ ప్రేక్షకులను రంజింపజేయగలరు.
కుబేరకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేశారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా జూన్ 20న విడుదల చేయబోతున్నారు.