పెద్ది: రైల్లో యాక్షన్ సన్నివేశాలు: న భూతో నభవిష్యత్‌ అట!

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా ఫస్ట్ గ్లింమ్స్‌లో రామ్ చరణ్‌ కొట్టిన ఒకే ఒక్క ‘సిగ్నేచర్ షాట్’తోనే ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

ఈ సినిమాలో ఓ రన్నింగ్ ట్రైన్‌లో రామ్ చరణ్‌ చేసిన ఓ యాక్షన్ సన్నివేశం, ఇప్పటి వరకు భారతీయ సినీ పరిశ్రమలో రాలేదని అంత గొప్పగా ఉందని దాని సారాంశం. ఈ యాక్షన్ సన్నివేశం కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో రామ్ చరణ్‌ డూప్ లేకుండా చాలా రిస్కీ స్టంట్స్ చేసినట్లు తెలుస్తోంది. గురువారంతో హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్‌ పూర్తవుతుంది.     

పెద్దిలో రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ బ్యూటీ , జాన్వీ కపూర్‌ చేస్తుండగా జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు. 

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఏడాది మార్చి 27న పెద్ది విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ గ్లింమ్స్‌లోనే ప్రకటించారు.