విజయ్ సేతుపతి-పూరీ సినిమాలోకి సంయుక్త

టాలీవుడ్‌ దర్శకుడు పూరీ జగన్నాధ్, కోలీవుడ్‌ నటుడు విజయ్ సేతుపతి కలిసి చేయబోతున్న సినిమాలో చేయబోతున్న నటీనటుల వివరాలను పూరీ-ఛార్మీ స్వయంగా ప్రకటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి టబు, రాధిక ఆప్టేల పేర్లను ప్రకటించిన తర్వాత ఇప్పుడు సంయుక్తని తమ సినిమాలోకి తీసుకుంటున్నట్లు వారు ప్రకటించారు. ఆమె బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న అఖండ-2లో కీలకపాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమాకు మొదట ‘బెగ్గర్’ అని టైటిల్‌ అనుకున్నప్పటికీ తర్వాత ‘భవతి భిక్షాం దేహి’గా మార్చినట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవగానే ఈ నెలాఖరులోగా షూటింగ్‌ ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు.

ఈ సినిమాని పూరీ, ఛార్మీలు తమ సొంత బ్యానర్ ‘పూరీ కనెక్ట్స్’తో పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగిన తర్వాత ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తారు.