జూలై 25న హరిహర వీరమల్లు రిలీజ్‌?

క్రిష్ దర్శకత్వంలో ప్రారంభించి జ్యోతికృష్ణ దర్శకత్వంలో ముగించుకున్న హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 12న విడుదల కావలసి ఉండగా, చివరి నిమిషంలో వాయిదా పడింది. నాలుగేళ్ళుగా సినిమా తీస్తున్నా ఇంకా రిలీజ్‌ చేయకపోవడంపై పవన్ కళ్యాణ్‌ అభిమానులు తీవ్ర అసహనంతో ఉన్నారు.

వారికి ఊరట కలిగించే ఓ వార్త వినిపిస్తోందిప్పుడు. వచ్చే నెల 25న హరిహర వీరమల్లు విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందట! కానీ రిలీజ్‌ డేట్ ప్రకటించి మళ్ళీ వాయిదా వేస్తే పరువు పోతుంది కనుక అన్ని పనులు పూర్తి చేసుకున్నాకనే రిలీజ్‌ డేట్ ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

జూన్ 27న మంచు విష్ణు ‘కన్నప్ప’, జూన్ 20న శేఖర్ కమ్ముల ‘కుబేరా విడుదల కాబోతున్నాయి. ఆ తర్వాత జూలై 4న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’, నితిన్‌ ‘తమ్ముడు,’ జూలై 11న క్రిష్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్‌ ఓరియంటడ్‌ మూవీ ‘ఘాటి’ వరుసగా రిలీజ్‌ కాబోతున్నాయి. జూలై 25న హరిహర వీరమల్లుని విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ అన్నీ సరిచూసుకున్నాక రిలీజ్‌ డేట్ ప్రకటిస్తారు.