గోపి అచ్చర దర్శకత్వంలో సుహాస్ కొత్త సినిమా షురూ

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’తో హిట్ అందుకున్న సుహాస్ తాజాగా గోపి అచ్చర దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభించారు. హైదరాబాద్‌లో నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో సుహాస్‌కు జోడీగా శివాని నటిస్తున్నారు. 

ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్‌ వారిపై క్లాప్ కొట్టగా, నటుడు సత్యదేవ్ కెమెరా స్విచ్ ఆన్‌లైన్‌ చేశారు. వంశీ నందిపాటి గౌరవ దర్శకత్వంతో లాంఛనంగా షూటింగ్‌ ప్రారంభించారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత బి. నరేంద్ర రెడ్డి తెలిపారు. 

ఈ సినిమాలో నరేష్, అన్నపూర్ణ, సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. సుహాస్ సూపర్ హిట్ సినిమా ‘రైటర్ పద్మభూషణ్’కు దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాకి కధ అందిస్తున్నారు. 

త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి కెమెరా: మహిపాల్ రెడ్డి, ఎడిటింగ్: విప్లవ్‌, ఆర్ట్: ఏ రామ్ కుమార్‌ చేస్తున్నారు.