కుబేర ట్రైలర్‌ రేపే విడుదల

నాగార్జున, ధనుష్, రష్మిక కాంబినేషన్‌లో జూన్ 20న వస్తున్న ‘కుబేర’ కోసం శేఖర్ కమ్ముల అభిమానులు అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పోస్టర్స్, పాటలు, టీజర్‌తో ఇప్పటికే కుబేరపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

రేపు (శుక్రవారం) కుబేర ట్రైలర్‌ విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్‌కి వారం రోజులు ముందు విడుదల చేస్తున్న ఈ ట్రైలర్‌ ‘కుబేర’కి ఇంకెంత హైప్ క్రియేట్ చేస్తుందో?  

ఈ సినిమాలో రష్మిక మందన, జిమ్ సరబ్, సాయాజీ ఏక్‌నాధ్ షిండే తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేశారు. 

శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో విడుదల చేస్తున్నారు.