సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ 33వ సినిమా

గోపీచంద్ ఇప్పటి వరకు 32 సినిమాలు చేశారు. అయినా సరైన హిట్ పడకపోవడం వలన టాలీవుడ్‌లో వెనకబడిపోతున్నారు. ఇప్పుడు హీరోలందరూ సోషియో ఫ్యాంటసీ లేదా చారిత్రిక నేపధ్యంగల సినిమాలు చేస్తున్నారు. కనుక గోపీచంద్ కూడా ఈ ట్రెండ్ ఫాలో అయిపోతూ చారిత్రిక నేపధ్యంగల సినిమా మొదలుపెట్టారు. ఈరోజు గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటిస్తూ ఓ పోటర్, వీడియో విడుదల చేశారు. 

‘ఘాజీ’తో అందరినీ మెప్పించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ చేయబోతున్న ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: మణికందన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు ప్రకటిస్తారు.