
త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ తర్వాత ఇంతవరకు మరో సినిమా మొదలుపెట్టలేదు. అల్లు అర్జున్తో సినిమా చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటే, అల్లు అర్జున్ కోలీవుడ్ దర్శకుడు అట్లీతో సినిమా మొదలుపెడుతున్నారు. కనుక అల్లు అర్జున్తో అనుకున్న సోషియో ఫాంటసీ సినిమాని జూ.ఎన్టీఆర్తో మొదలుపెట్టబోతున్నారు.
నిర్మాత నాగ వంశీ ‘గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్’ అంటూ ఓ సంస్కృత శ్లోకం సోషల్ మీడియాలో పెట్టి అభిమానులకు హింట్ ఇచ్చారు.అత్యంత శక్తివంతమైన దేవుళ్ళలో నాకు అత్యంత ఇష్టమైయాన్ అన్న ఒకరు,” అంటూ ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్ కార్తికేయ భగవానుడుగా నటించబోతున్నట్లు దానిలో సూచించారు. వార్-2 తర్వాత జూ.ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలుపెట్టలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఖాళీగా ఉన్నారు. కనుక ఇద్దరూ కలిసి త్వరలోనే ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టేయబోతున్నారు.