అవికా గోర్ పెళ్ళి కుదిరింది

‘చిన్నారి పెళ్ళి కూతురు’గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవికా గోర్ ఇప్పుడు నిజామాబాద్‌ జీవితంలో కూడా పెళ్ళి కూతురు కాబోతోంది. ఈరోజు తాను ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్న మిళింద్  చద్వానీని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేశారు. 

అతను మొదట సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేసేవారు. తర్వాత సొంతంగా వ్యాపారం ప్రారంభించి స్థిరపడ్డారు. క్యాంప్ డైరీస్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థని కూడా స్థాపించి నిర్వహిస్తున్నారు. ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ ద్వారా 2019లో పరిచయం అయ్యింది.

ఆ పరిచయం స్నేహంగా, ప్రేమగా మారి చివరికి పెద్దల అంగీకారంతో పెళ్ళి వరకు వచ్చేశారు. తమకు వివాహ నిశ్చితార్ధం జరిగినప్పుడు తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, త్వరలోనే తాము పెళ్ళి చేసుకోబోతున్నామని తెలియజేశారు. 

అవికా గోర్ హీరోయిన్‌గా చేసిన తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’తో మంచి పేరు, సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత సినిమా చూపిస్త మావా, ఎక్కడికి పోతావు చిన్నవాదా, రాజుగారి గది-3 సినిమాలలో నటించి మెప్పించారు. చివరిగా చేసిన ‘షణ్ముఖ’ ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. సినీ కెరీర్‌లో వెనక బడటంతో ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకొని హాయిగా జీవితంలో సెటిల్ కాబోతున్నారు.