
నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమా నిరాశపరిచినా వెంటనే మరో సినిమా మొదలుపెట్టేశాడు. పవన్ కళ్యాణ్‌కి వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ అందించిన శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘తమ్ముడు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సప్తమి గౌడ, లయ, హర్ష బొల్లమ్మ, సూరబ్ సచ్ దేవ్, శ్వాసిక, హరితేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా జూలై 4న విడుదల కాబోతోంది. కనుక నేడు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సినిమాకు సంగీతం: బి. ఆజనీష్ లోక్‌నాథ్, కెమెరా: కేవీ గుహ్యం, సమీర్ రెడ్డి, సేతు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: జీఎం శేఖర్, స్టంట్స్: విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ చేస్తున్నారు.
వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాజు, సతీష్ కలిసి తమ్ముడిని జూలై 4 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.