సంబంధిత వార్తలు

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఏఎస్ చౌదరి మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. గోపీచంద్ హీరో యజ్ఞం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఏఎస్ చౌదరి, వీరభద్ర (బాలయ్య), పిల్లా నువ్వు లేని జీవితం (సాయి ధరమ్), సౌఖ్యం (గోపీచంద్), ఆటాడిస్తా (నితిన్), తిరగబడరా సామి (రాజ్ తరుణ్) సినిమాలు చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ గత కొంతకాలంగా వారికి దూరంగా వేరేగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఏఎస్ చౌదరి మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.