జూన్ 13న కన్నప్ప ట్రైలర్‌

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ టీజర్‌ ఇటీవల విడుదలయ్యింది. సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండటంతో జూన్ 13న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ ‘కన్నప్ప’ పోస్టర్ సోషల్ మీడియాలో పెట్టారు. 

ఈ సినిమాపై మోహన్ బాబు, మంచు విష్ణు చాలా నమ్మకం పెట్టుకోవడంతో చాలా బారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా 5 భాషల్లో తీశారు. కనుక ఈ సినిమాలో కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్‌ నటీనటులు అందరినీ తీసుకున్నారు. 

ఈ సినిమాలో కన్నప్పకి జోడీగా నుపూర్ సనన్ నటిస్తోంది. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా, ప్రభాస్‌ రుద్రుడుగా నటిస్తున్నారు. మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

కన్నప్ప సినిమాకు దర్శకత్వం: ముఖేష్ కుమార్‌ సింగ్‌, సంగీతం: స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్: చిన్న, ఎడిటింగ్: ఆంథోనీ చేస్తున్నారు.

అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు విష్ణు నిర్మిస్తున్న కన్నప్ప జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.