
తెలుగు సినీ పరిశ్రమని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులకు ఇప్పటికే ఎంపిక పూర్తయింది. ఈ నెల 14న హైదరాబాద్ హెటెక్స్ వేదికగా సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరుగుతుంది. దీని కోసం తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్ఏ) రూపొందించిన గద్దర్ అవార్డ్ మెమొంటో చిత్రాన్ని మీడియాకు విడుదల చేసింది. మద్యలో తెలంగాణ రాజ్యముద్ర, దాని చుట్టూ టీజీఎఫ్ఏ అని ముద్రించిన డోలు (డప్పు) వాయిద్యాన్ని ఓ చేతితో పట్టుకున్నట్లు, ఆ చేతికి సినిమా రీల్ చుట్టినట్లు డిజైన్ చేశారు.
ఉత్తమ నటీనటులు:
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప-2)
ఉత్తమ నటి: నివేదా ధామస్ (35 ఇది చిన్న కధ కాదు)
ఉత్తమ సహాయ నటుడు: ఎస్జె సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ హాస్య నటులు: సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా-2)
ఉత్తమ బాలనటులు: మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక (35 ఇది చిన్న కధ కాదు)
ఉత్తమ దర్శకులు, గాయకులు:
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి ఏడీ 2898)
ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రాజాకార్)
ఉత్తమ నేపధ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
ఉత్తమ నేపధ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప-2)
ఉత్తమ కధా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాధ్ రెడ్డి (గామి).